
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ఉధృతం
పాడేరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ బొడ్డపుట్టులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారన్నారు.దానిలో భాగంగా గిరిజన ప్రాంతమైన అల్లూరి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేశారని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల కోసం కళాశాలను మంజూరు చేస్తే ఇప్పటి సీఎం చంద్రబాబునాయుడు దానిని ప్రైవేట్ పరం చేయాలని యత్నిస్తున్నారని చెప్పారు. ఆ కళాశాలను ప్రైవేటు పరంకాకుండా కాపాడుకునేందుకు కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీందెరి రాంబాబు, సర్పంచ్ గుల్లెలి ఆశ్విజ, ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, కాడెలి, కించూరు, గబ్బంగి సర్పంచులు వనుగు, బసవన్నదొర, వంతల రాంబాబు, గొల్లూరి నీలకంఠం, మండల యువజన అధ్యక్షుడు లింగమూర్తి, మాజీ సర్పంచ్ నాగరాజు, నాయకులు సుబ్రహ్మణ్యం,బాబుల్ నాయుడు, అర్జున్, నడిపన్న, శ్రీను నాగేశ్వరరావు పాల్గొన్నారు.
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు