
భూముల రీసర్వే వేగవంతం
మిగతా 2వ పేజీలో
● మంజూరైన గృహాలు త్వరితగతిన
గ్రౌండింగ్
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
సాక్షి,పాడేరు: భూముల రీసర్వే, మ్యుటేషన్లు, ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు.పలుశాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఆర్వో, తహసీల్దార్ల లాగిన్లలో పెండింగ్‌లో ఉన్న భూముల సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. జీవో నంబరు 30.23లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కాగా అమలుజేయాలన్నారు. మంజూరైన అన్ని గృహాలను గ్రౌండింగ్ చేయాలని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో అర్హత ఉన్నవారిని గుర్తించి హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. కులధ్రువీకఱన పత్రాలను మంజూరు చేయాలని, కొత్త ఓటరు నమోదు, ఓటరు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. అటవీశాఖ స్థలాలను రీసర్వే చేసి సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరించుకోవాలని డీఆర్వోను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వ భరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ శుభం నోక్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి వెంకట సాహిత్, డీఆర్వో పద్మలత పాల్గొన్నారు.
అన్ని గ్రామాల్లో గ్రామసభలు
గాంధీ జయంతి నాడు దసరా పండగ కావడంతో గ్రామసభలను