
జీఎస్టీ సంస్కరణలతోరైతులకు మరింత మేలు
● అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్
పాడేరు రూరల్: జీఎస్టీ సంస్కరణలతో రైతులకు మరింత మేలు జరిగిందని అసిస్టెంట్ కలెక్టర్ కె.సాహిత్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీఎస్టీ 2.0 పన్ను తగ్గింపుపై నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వ్యవసాయ రంగానికి మేలు చేకుర్చేందుకు 2.0 పన్ను తగ్గింపుపై విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రైతులు, అధికారులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్, జీఎస్టీ అధికారి శేషగిరినాయుడు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.