
220 కిలోల గంజాయిపట్టివేత– ముగ్గురి అరెస్టు
పాడేరు : ముందస్తు సమాచారం మేరకు పెదబయలు జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేసి, 220కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పాడేరు డీఎస్పీ షెహబాజ్ అహ్మద్ బుధదవారం పాడేరులో విలేకరులకు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి నిందితులు గతంలో గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన అన్ని రకాల ఆస్తులను జప్తు చేశామన్నారు. పాడేరు, ఇతర ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్వపరాలు తెలుసుకోవాలని సూచించారు. గంజాయి వ్యవహారంలో ఏ మాత్రం ప్రమేయం ఉన్నా అరెస్ట్‌లు తప్పవని హెచ్చరించారు. గంజాయి కేసుల్లో ప్రమేయం ఉంటే కఠిన శిక్షలు అమలు చేయడంతో పాటు గతంలో వారు సంపాదించిన అన్ని రకాల ఆస్తులు జప్తు చేయక తప్పదన్నారు. గంజాయి నిర్మూలకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.