
‘హైడ్రో పవర్’ అనుమతులు రద్దు చేయాల్సిందే
● వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్
● మొర్రిగుడలో సరిహద్దు దిమ్మలను ధ్వంసం చేసిన గిరిజనులు
అరకురలోయ టౌన్: గుజ్జెలి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ మొర్రిగుడలో ఏర్పాటుచేసిన సరిహద్దు దిమ్మలను గిరిజనులు ధ్వంసం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పపర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కొర్రా స్వామి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులు, చట్టాలకు విఘాతం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ కొర్రా స్వామి పాల్గొన్నారు.