
మెట్టవలసలో సమస్యలు పరిష్కరిస్తా
● గిరిజనులకు పాడేరు ఐటీడీఏ పీవోతిరుమణి శ్రీపూజ హామీ
● కుటుంబసభ్యులతో ప్రవాహం
హోంస్టే సందర్శన
అనంతగిరి (అరకులోయ టౌన్): సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హామీ ఇచ్చారు. బుధవారం ఆమె మండలంలోని లంగుపర్తి పంచాయతీ మెట్టవలసలో ప్రవాహం హోం స్టేను కుటుంబ సభ్యులతో సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రాజుకు పీవో పలు సూచనలు చేశారు. అనంతరం మెట్టవలస గిరిజనుల సమస్యలను తెలుసుకున్న పీవో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. హోంస్టేకు సమీపంలోని పంట పొలాలు, పొంగి ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. సహజసిద్ధ ప్రకృతి అందాలను తిలకించారు.