
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్
పాడేరు రూరల్: ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదివాసీ ఉద్యోగ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లతో కూడిన కరపత్రాలను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు వెంకటరమణ, మహేష్, శేషగిరి, వరహలక్ష్మి, కర్రన్న పాల్గొన్నారు.