
సారా తయారీపై ఉమ్మడి రాష్ట్రాల ఎకై ్సజ్ దాడులు
పెదబయలు : ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఓండ్రుగెడ్డ, సుడుబ్ గ్రామాల్లో దాడులు చేసి 5500 లీటర్ల బెల్లం ఊటతో పాటుగా 500 లీటర్ల నాటు సారా ధ్వంసం చేసినట్టు పాడేరు ఎకై ్సజ్ సీఐ ఆచారి తెలిపారు. విజయవాడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు సోమవారం ఆంధ్ర ఒడిశా ఎకై ్సజ్ అధికారుల సహాయంతో దాడులు చేయడం జరిగిందనిన్నారు. ఇక్కడ తయారు చేసిన సారా ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఎక్కువగా రవాణా చేస్తున్నారని, పెదబయలు, హుకుంపేట, పాడేరు ప్రాంతాలకు వివిధ మార్గాల ద్వారా రవాణా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాడేరు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐలు హిరన్, లక్ష్మీ, గణేష్, వీర్రాజు, ఒడిశా ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ అన్నపూర్ణ రతి , నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఒడిశాలో 5500 లీటర్ల బెల్లం ఊట, 500 లీటర్ల నాటు సారా ధ్వంసం
సారా తయారీ, రవాణా చేస్తే కఠిన చర్యలు
పాడేరు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఆచారి