
‘జూనియర్ అథ్లెటిక్స్’ చాంపియన్ విశాఖ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖ అథ్లెట్లు బి.ఇషానా, కె.ఆర్.వి.ఎం.కుమార్, బి.శైలజ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి వ్యక్తిగత చాంప్‌లుగా నిలిచారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కూడా కై వసం చేసుకుంది. సోమవారంతో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ముగిసిన ఈ పోటీలను సబ్‌జూనియర్ (అండర్–14, 16), యూత్ (అండర్–18), జూనియర్ (అండర్–20) బాలబాలికల విభాగాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో నిర్వహించారు. బాలికల అండర్–14 విభాగంలో ఇషానా, అండర్–18 విభాగంలో శైలజ, బాలుర అండర్–16 విభాగంలో కుమార్ తమ విభాగాల్లో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లు సాధించారు. అలాగే విశాఖ జిల్లా జట్టు 269 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. బాలుర చాంపియన్‌షిప్‌ను 156 పాయింట్లతో విశాఖ కై వసం చేసుకోగా, బాలికల చాంపియన్‌షిప్‌ను 113 పాయింట్లతో సాధించింది.