జిల్లా ఆస్పత్రిలో మెగా వైద్య శిబిరం
పాడేరు : స్థానిక ప్రభుత్వ జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి ప్రారంభించారు. వైద్య శిబిరంలో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 18ఏళ్లు నిండిన యువతకు కిశోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 496 మందికి వైద్య పరీక్షలు జరిపారు. వీరిలో మెరుగైన చికిత్స కోసం 29మందిని రిఫర్ చేశారు. ఐదుగురు రోగులకు త్వరలో స్థానిక జిల్లా ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పీఏసీఎస్ చైర్మన్ బుజ్జిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగరావు పాల్గొన్నారు.
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్‌లో496 మందికి వైద్య పరీక్ష