
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్న వరాత్రి వేడుకలు వైభ వంగా జరుగు తున్నాయి. వాడవాడలా దుర్గమ్మ విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పట్టణంలోని మెయిన్‌రోడ్డులో కనకదుర్గమ్మ ఉ త్సవాలను సోమ వారం ప్రారంభించారు. పాత ఆస్పత్రి సెంటర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కనకదుర్గమ్మ ప్రతిమను భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. మెయిన్‌రోడ్డు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, మండపం సెట్ ఆకట్టుకున్నాయి.సాయంత్రం సహస్ర దీపార్చన చేశారు. అక్టోబర్ 4వతేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది.ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఏరువాక వెంకటరమణ,కోటపాడు శ్రీను,వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు, వర్తక సంఘం,ఉత్సవ కమిటీ ప్రతినిధులు శివరాత్రి నాగేశ్వరరావు,ఆకాశపు సోమరాజు,వెయ్యాకుల సత్యనారాయణ,పూసర్ల గోపి,పచ్చా బుజ్జి,పచ్చా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
ముంచంగిపుట్టు: మండలంలోని వనభసింగి పంచాయతీ కేంద్రంలో సోమవారం ఆంధ్ర వనవాసీ కళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో దుర్గాష్టమి –మహిళా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్దలతో దుర్గాదేవికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబాయికి చెందిన అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ ఆశ్రమం ప్రతినిధి ఆతుల్ జోగ్ పాల్గొని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. గిరిజన గ్రామాల్లో తమ ఆశ్రమం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం, మహిళలకు దుర్గాదేవి ఫోటో, పసుపు, కుంకుమ, అందించారు. సర్పంచ్ లక్ష్మణ్,వనవాసీ ఆశ్రమం ప్రతినిధులు, సభ్యులు ఆదినారాయణ, అచ్చమ్మ, భగత్‌రామ్, బాలకృష్ణ, రాజు, జగన్నాథం, బలోక్‌దొర పాల్గోన్నారు.
సీలేరు: ఊరువాడ అంగరంగ వైభవంగా దుర్గమ్మ శరన్నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు దుర్గమ్మ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సీలేరు, దారకొండ ప్రాంతాల్లో ఈ పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు దామోదర శర్మ. రామశర్మ చిన్న పిల్లలతో సరస్వతీ దేవి పూజలను చేయించారు.శివాలయం ఆలయంలో సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. దారకొండలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఘనంగా బతుకమ్మ పండగ
కొయ్యూరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భవానీ భక్తులు సోమవారం బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. పిల్లలు బతుకమ్మ పాట లు పాడుతూ నృత్యాలు చేశారు.మహిళలు బతుకమ్మను తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ప్రసాద్ ఇంటి సమీపంలో ఉన్న రామాలయం నుంచి బతుకమ్మను తీసుకొచ్చారు. కమిటీ సభ్యులు ఎం చక్రరావు,చిరంజీవి,నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత