
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం
రంపచోడవరం: వైఎస్సార్‌సీపీ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటుందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో డిజిటల్ బుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలుకు ఎటువంటి బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొన్న డిజిటల్ బుక్‌లో ఆ వివరాలు పొందుపరచాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ సభ్యుడు వంశీ కుంజం, ఉలవల లక్ష్మి, పార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్ పండా రామకృష్ణదొర, మండల పార్టీ కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, ఉప సర్పంచ్ వి.ఎం.కన్నబాబు, చితుకులయ్యరెడ్డి, బొబ్బా శేఖర్, రత్నరాజు, కారుకోడి పూజ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి