
కలువ పూల కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి
చెరువులో మునిగి యువకుడి మృతి
డుంబ్రిగుడ: కలువ పూల కోసం చెరవులో దిగి ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అరమ పంచాయతీ డుంబ్రివలస గ్రామానికి చెందిన పాంగి సంజీవరావు(21) అనే యువకుడు కలువ పూల కోసం గ్రామానికి సమీపంలోని నందివలస చెరువులో ఆదివారం దిగి, ఊబిలో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. సంజీవరావు ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. చెరువు గట్టు మీద యువకుడి దుస్తులు కనిపించడంతో దానిలో గాలింపు చర్యలు చేపట్టి, ఊబిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానఒక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. డుంబ్రివలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. డుంబ్రిగుడ పోలీసులు కేసు నమోదు చేసి నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అరకులోయ ఆస్పత్రికి తరలించారు.