
రాష్ట్రంలో గాడితప్పిన పాలన
మిగతా II పేజీలో
పాడేరు : రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడితప్పిందని కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు డిజిటల్ బుక్ క్యూఆర్‌కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు బకాయిస్తున్నారని, అక్రమంగా అరెస్టులు చేయడమే కాకుండా దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు తెగబడి అక్రమ కేసులు, అరెస్ట్‌లు చేస్తోందన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలు డిజిటల్ బుక్‌లో పేర్లు నమోదు చేసుకుని పూర్తి సమాచారం పొందుపర్చాలన్నారు. ఈ సేవలను ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు..
అరకు ఎంపీ తనూజరాణి
కూటమి ప్రభుత్వానికి పాలన చేతకాక వారు చేస్తున్న వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టడం ఏమిటని అరకు ఎంపీ తనూజరాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని రెడ్‌బుక్ రాజ్యంగాన్ని అమలు చేస్తుందన్నారు. ఓ వైపు పార్టీ నాయకులకే కాకుండా మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. తగిన
ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు
దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతూ భయానక పరిస్థితులు
రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్ట ప్రకారం చర్యలు
కార్యకర్తలకు అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
మత్య్సరాస విశ్వేశ్వరరాజు
జిల్లా కేంద్రంలో డిజిటల్ బుక్
క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణ

రాష్ట్రంలో గాడితప్పిన పాలన