
జాబ్‌మేళాలో 40 మంది ఎంపిక
చింతపల్లి: చింతపల్లి డిగ్రీ కళాశాలలో మిలీనియం సాఫ్ట్‌వేర్
సొల్యూషన్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జాబ్ మేళాలో 40 మంది అభ్యర్థులు ఎంపికై నట్టు సాఫ్ట్‌వేర్ ట్రైనర్ సీహెచ్.శివమణి తెలిపారు.శుక్రవారం డిగ్రీ కళాశాలలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియు జీకేవై )సౌజన్యంతో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లబించింది.ఈ జాబ్‌మేళాలో 40 నిరుద్యోగ యువత శిక్షణకు ఎంపికయ్యారు. ఆయా అభ్యర్థులకు విశాఖపట్నం శీలా డిడియుజీకేవైలో ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. వచ్చే నెల 8న మరో జాబ్‌మేళా నిర్వహిస్తామన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ప్రతినిధులు అరవింద్, నేహడాలి, గాయత్రి తదితరులు ధ్రువపత్రాలను పరిశీలించారు. కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.