
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి,పాడేరు: దుర్గమ్మతల్లి నవరాత్రి ఉత్సవాలను జిల్లాలోని అన్ని దేవతామూర్తుల ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా నాల్గోవ రోజు శుక్రవారం దుర్గమ్మతల్లితో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను మహాలక్ష్మిగా అలంకరించారు. భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. పాడేరులోని రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గమ్మ, మహాలక్ష్మితల్లి ఆలయాలతో పాటు అరకులోయలోని మల్లికార్జునస్వామి సమేత భ్రమరాంభిక తల్లికి కుంకుమార్చన చేశారు.
జి.మాడుగుల: మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ జంక్షన్ వద్ద భవానీ పీఠంలో గురువారం మహాలక్ష్మి అవతారం అమ్మవారికి భక్తులుప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ దుర్గమ్మ అమ్మవారిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండబాబు, దంపతులు, భక్తులతో కలిసి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బంధవీధి గ్రామంలో భారీ అన్నసమారాధ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, వర్తక సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉత్సవ కమిటీ సభ్యులు స్వామినాయుడు, చంటి, సత్తిబాబు, భాస్కరరావు, శ్రీను, చిరంజీవి, నానాజీ, కొండలరావు, గణేష్, మణికంఠ, నాగేశ్వరరావు, కృష్టమూర్తి తదితరులు పర్యవేక్షించారు. సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలోభక్తులు పాల్గొన్నారు.
కొయ్యూరు: మండల కేంద్రంలో భవానీ భక్తులు గురువారం రాత్రి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించారు. రాత్రి ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు పూజ జరిగింది.స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత