
ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
సాక్షి,పాడేరు: జిల్లాలో రహదారులు,భవన నిర్మాణాలకు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల ని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ లో శుక్రవారం పలు ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఆయ న సమీక్షించారు. నాబార్డులో మంజూరైన రోడ్డు పనులను నవంబర్‌లో ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ బాలసుందరబాబు కలెక్టర్‌కు నివేదించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఘాట్‌రోడ్లలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని, పాడేరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణానికి సంబంధించి డిజైన్ రుపోందించాలని, ముందుగా ప్రహరీ పూర్తి చేయాలని సూచించారు. పీఎం జన్‌మన్ భవనాలు, మల్టీపర్పస్ భవనాలు, అంగన్‌వాడీ, బర్త్ వెయిటింగ్ హాళ్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఆర్‌అండ్‌బీ, సీసీడీపీ పనులపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. గ్రౌండింగ్ చేయాల్సిన పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించి వేగవంతం చేయాలన్నారు. గోకులం షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసి డెయిరీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవోలంతా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి, పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, అపూర్వభరత్, స్మరణ్‌రాజ్, పలు ఇంజనీరింగ్‌శాఖల ఈఈలు, డీఈఈలు పాల్గొన్నారు.