
ప్రతి అర్జీ పరిష్కరించాల్సిందే
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● పీజీఆర్‌ఎస్‌లో 121 వినతుల స్వీకరణ
పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో స్వీకరించిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాల్సిందేనని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ 121 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారమవుతుందనే నమ్మకంతోనే ప్రజలు ప్రతి వారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు వస్తుంటారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గడువులోగా వాటిని పరిష్కరించాలని సూచించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం మీకోసంలో స్వీకరించిన అర్జీలను ప్రతి సోమవారం క్షుణ్ణంగా పరిశీలన చేసి త్వరిగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌బీఎస్ నందు, ఎస్‌డీసీ లోకేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీ, టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఐటీడీఏ ఏవో హేమలత తదితరులు పాల్గొన్నారు.