
జగన్‌మోహన్‌రెడ్డిపైఅనుచిత వ్యాఖ్యలు తగదు
● కూటమి నేతలకు గుణపాఠం తప్పదు
● అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: బాధ్యత గల పదవిలో ఉంటూ అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహరెడ్డిని సైకో అని సంబోధించడం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తగదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చట్ట సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్కారం లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే అన్నారు.