
విద్యుత్ వైర్లు తగిలి వ్యక్తికి తీవ్రగాయాలు
అడ్డతీగల: అడవి జంతువులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మండలంలోని తుంగమడుగులకు చెందిన ఉలెం సూరిబాబు అనే గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు. తుంగమడుగుల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అడవి జంతువులను వేటాడేందుకు అటవీప్రాంతంలో విద్యుత్ వైర్లు ఏర్పాటుచేశారు. పశువుల జాడకోసం అటవీప్రాంతంలోకి వెళ్లిన సూరిబాబుకు విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరాడు. అదే ప్రాంతంవైపు వెళ్తున్న గ్రామస్తులు అతనిని చూశారు. వెంటనే దుప్పులపాలెం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
అడవి జంతువుల కోసం
ఏర్పాటు చేయడంతో ప్రమాదం