
‘హైడ్రో పవర్’ వద్దే వద్దు
● అనంతగిరిలో కదంతొక్కిన ఆదివాసీలు
అనంతగిరి (అరకులోయ టౌన్): గిరిజన ప్రాంతంలో నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమించారు. మండల కేంద్రంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనుమతులు రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్ వీరభద్రాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ నేత కొర్రా సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, స్వచ్ఛంద కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ శోభ సోమేశ్వరి, గ్రీవెన్స్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సందడి కొండబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఆర్.స్వామి, పార్టీ మండల అధ్యక్షుడు స్వాభి రామూర్తి, యువజన నాయకుడు రేగం చాణిక్య, సర్పంచ్‌లు పెంటమ్మ, పాగి అప్పారావు, గణేష్, రాములమ్మ, సెంబి సన్యాసిరావు, కొర్రా సింహద్రి, జన్ని సన్యాసిరావు, అన్నపూర్ణ, ఎంపీటీసీలు తవిటి నాయుడు, మదీన, అశోక్ పాల్గొన్నారు.