ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఘటన
ముంచంగిపుట్టు: మండలంలో గల కుమడ పంచాయతీ చీపురుగొంది గ్రామానికి చెందిన గిరిజన బాలుడు కొర్ర రంజిత్‌కుమార్(7) పాముకాటుకు మృతి చెందాడు. ఇంటిలో నిద్రిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కట్లపాము కాళ్లపై కాటు వేసింది. దీంతో రంజిత్‌కుమార్ పెద్దగా కేకలు వేయడంతో పామును గమనించిన తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో హతమార్చారు.
రంజిత్‌కుమార్ కాళ్లపై పాముకాటును గమనించిన వారు రూడకోట ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రంజిత్‌కుమార్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు.