
హోంస్టే పనులు వేగవంతం చేయండి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
సాక్షి,పాడేరు: జిల్లాలోని రంపచోడవరం, పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లోని గిరిజన గ్రామాల్లో చేపట్టిన హోంస్టేల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. కారవాన్ టూరిజం, హోంస్టే పనుల పురోగతిపై పర్యాటక, అటవీ తదితర శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రధాన కూడళ్ల వద్ద 50సెంట్ల నుంచి ఎకరా వరకు భూములు సేకరించాలన్నారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి పనులకు ఈ భూమిని వినియోగించాలని సూచించారు. మోడల్ హౌస్‌లకు ప్రణాళికలు సిద్ధం చే యాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడమే కాకుండా అటవీశాఖ చెక్‌పోస్టులలో తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్‌రాజ్, అపూర్వ భరత్, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీపీవో చంద్రశేఖర్, జిల్లా టూరిజం అధికారి దాసు, డీఎల్‌పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు.