
ఎకో టూరిజం ప్రాజెక్ట్ వద్దని వినతి
● ఎమ్మెల్యే మత్స్యలింగంను కోరినమాడగడ గిరిజనులు
అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని మాడగడ పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. ఈమేరకు వారు గురువారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంకు వినతిపత్రం సమర్పించారు. వివిధ వ్యాపారాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి జీవనోపాధి పొందుతున్న గిరిజనులంతా ఎకో టూరిజం ఏర్పాటు చేయడం వల్ల నష్టపోతారని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌లో అతి కొద్ది మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తారన్నారు. మిగిలిన వారంతా జీవనోపాధి కోల్పోతారని వివరించారు. పంచాయతీ పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, ఎం. గెన్ను, అప్పారావు, మోహన్‌రావు, పి. రాజులమ్మ, బాక బాలరాజు, బాబ్జి, డి. చిన్న, సుమన్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్ష,ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగం వింగ్ ప్రధాన కార్యదర్శి నర్సింహమూర్తి పాల్గొన్నారు.