
విద్యుత్ సరఫరాలో లోపాలు లేకుండా చర్యలు
● విద్యుత్‌శాఖ డీఈ వేణుగోపాల్
ముంచంగిపుట్టు: విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్‌శాఖ డీఈ వేణుగోపాల్ అన్నా రు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్‌లో మాకవరం ఫీడర్‌కు చెందిన కొత్త బ్రేకర్లను మంగళవారం విద్యుత్‌శాఖ అధికారులు ఏర్పాటు చేశారు.ఈ పనులను డీఈ వేణుగోపాల్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాకవరం ఫీడర్‌లో బ్రేకర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ సరఫరాలో నెలకొన్న సాంకేతిక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. 2007లో ఏర్పాటు చేసిన బ్రేకర్లను ఇప్పటికీ వినియోగించడం వల్ల విద్యుత్ సరఫరాలో సమస్యలు వస్తుండేవని,ప్రసుత్తం ఏర్పాటు చేసిన ఆధునిక బ్రేకర్లు వల్ల మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఏడీ మురళీమోహన్,ఏఈ సురేష్ పాల్గొన్నారు.