
పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రంపచోడవరం: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోసు రమేష్‌బాబుదొర, ఎంపీటీసీ వంశీ కుంజం అన్నారు. ముసురుమిల్లి అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సాల్లో వారు మాట్లాడారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయాలను ఆహారంగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో స్టాక్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబరు సరస్వతి, సీతపల్లి ఆలయ మాజీ చైర్మన్ బొబ్బా శేఖర్, మహిళ పోలీస్ కృష్ణవేణి, రోషిణి తదితరులు పాల్గొన్నారు.