
స్వస్త్ నారీ సశక్త్ పరివార్‌తో మహిళలకు మేలు
హుకుంపేట: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌తో మహిళలకు మరింతగా వైద్య సేవలు అందుతాయని డీఎంహెచ్‌వో డాక్టర్ విశ్వే శ్వరనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని పాడిపుట్టులో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు మహిళలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. స్థానిక వైద్యాధికారి భార్గవి శ్రీలత, ఆస్పత్రి సూపర్‌వైజర్ సాంబశివరావు, సర్పంచ్ సోమెలి సత్యవతి పాల్గొన్నారు.