
హత్యకేసులో నిందితుడి ఇంటికి నిప్పు
సీలేరు: సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో జరిగిన హత్యకేసులో నిందితుడి ఇంటికి మృతుడి బంధువులు మంగళవారం నిప్పు పెట్టి, ధ్వంసం చేశారు. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల యువకుడు అదే గ్రామానికి చెందిన వంతల భగత్‌రామ్‌ను హత్యచేసిన విషయం తెలిసిందే. భగత్‌రామ్ మృతదేహానికి మంగళవారం చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పారు. మృతదేహాన్ని చూసి భార్యా పిల్లలు, బంధువులు భోరున విలపించారు.
ఆగ్రహంతో ఉన్న మృతుడి బంధువులు దాడి చేస్తారనే భయంతో నిందితుడి కుటుంబ సభ్యులు గ్రామం నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న హతుడి బంధువులు... నిందితుడి ఇంటికి నిప్పుపెట్టి, ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ వరప్రసాద్, ఎస్‌ఐ రవీంద్ర గ్రామానికి వెళ్లి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని నచ్చ జెప్పారు. నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇదే గ్రామంలో మూడు నెలల వ్యవధిలో మూడు హత్యలు జరిగాయని, ఇది గ్రామానికి మంచిది కాదని, ఏమైనా గొడవలు ఉంటే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
గ్రామం నుంచి పరారైన కుటుంబ సభ్యులు