
గాయత్రీ మాత అలంకరణలో దుర్గమ్మ
సీలేరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం గాయత్రీ మాత అలంకరణలో సీలేరు,దారకొండ గ్రామాల్లో దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించారు. వనదుర్గ ఆలయంలో కె.శ్రీను దంపతులు, మణి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. నక్క జ్ఞానేశ్వర్ రావు అమ్మవారికి తొమ్మిది రోజులు నిత్య ప్రసాదాలను అందజేశారు. సీలేరు సర్పంచ్ దుర్జో అ మ్మవారి విగ్రహానికి ఆర్థిక సాయం అందజేశారు.
జి.మాడుగుల: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయ జంక్షన్ వద్ద అమ్మవారిని మంగళవారం గాయత్రీమాతగా అలంకరించారు. ఈ సందర్భంగా విజ్ఞాన భారతి ఇంగ్లిష్ మీడియం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, భక్తులు 108 సార్లు గాయత్రీమంత్ర జపం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్‌కుమార్, పాఠశాల కరస్పాండెంట్, సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ప్రముఖ్ మత్స్యరాస మత్స్యరాజు, ఉపాధ్యాయులు కమలకుమారి, జోత్స్న, వాణి, ప్రమీల, చైతన్య, సమరసతా సేవ ఫౌండేషన్ కన్వీనర్ శ్రీను,సాయిబాబు ఆలయ ధర్మకర్త కె.వెంకటరమణ,పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం నాయకుడు బాబూరావు పాల్గొన్నారు.
ఎటపాక: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు మంగళవారం అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తోటపల్లిలో జైమాత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, పూజలు చేశారు. గుండాలకాలనీ, చోడవరం గ్రామాల్లో కూడా అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.