
మాడగడ వ్యూపాయింట్ వద్ద ఊయల తొలగింపు
● ఎకో టూరిజం ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేపట్టిన అటవీశాఖ
అరకులోయ టౌన్: మండలంలోని ప్రముఖ సందర్శిత ప్రాంతమైన మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ వద్ద గిరిజనులు కర్రలతో ఏర్పాటు చేసిన ఉయ్యాలను మంగళవారం అటవీ శాఖ అధికారులు తొలగించారు. గత మూడేళ్ల క్రితం మాడగడ గ్రామ గిరిజనులు వ్యూ పాయింట్ వద్ద పర్యాటకులను ఆకర్షించేలా కర్రలతో ఏర్పాటు చేశారు. దీనిపై వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఉయ్యాలను తొలగించడం దారుణం అని పీసా కమిటీ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు తెలిపారు. వ్యూ పాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారన్న తొలగించడం దారుణమన్నారు. గిరిజన కుటుంబాలు వ్యూ పాయింట్ వద్ద వచ్చే ఆదాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే, అటవీశాఖ అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. అటవీ శాఖ అధికారులు గిరిజనుల పొట్ట కొట్టవద్దని ఆయన పేర్కొన్నారు.