
సచివాలయ ఉద్యోగులకు మంత్రి క్షమాపణ చెప్పాలి
పాడేరు రూరల్: సచివాలయ ఉద్యోగులను కించపరుస్తూ, అవహేళనగా మాట్లాడిన మంత్రి డోల వీరంజనేయస్వామి క్షమాపణలు చెప్పాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యా లయం వద్ద సచివాలయ ఉద్యోగులు నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అల్లూరి జిల్లా జేఏసీ నాయకుడు లకే నానిపాత్రుడు మాట్లాడుతూ ఆరేళ్లుగా గ్రామ స్థాయిలో పనిచే స్తూ ప్రజలకు సేవలందిస్తున్న తమను కించపరుస్తూ మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులపై మంత్రి డోల వీరంజనేయస్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మండల జేఏసీ అధ్యక్షుడు సీహెచ్ అనిల్,కార్యదర్శి లక్ష్మీనాయుడు, కోశాధికారి నాగేంద్ర పాల్గొన్నారు.