
వెదురు పెంపకంతో మేలు
● డ్వామా ఏపీడీ తూతిక శ్రీనివాసవిశ్వనాథ్
రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం సహకారంతో వెదురు పెంపకానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం కల్పిస్తున్నాయని డ్వామా ఏపీడీ తూతిక శ్రీనివాస్‌విశ్వనాథ్ అన్నారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఉపాధి, వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి, ఉపాధి హమీ జాబ్‌కార్డు ఉన్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మారేడుమిల్లి మండలంలో సుమారు 300 ఎకరాల్లో వెయ్యి మంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా వెదురు పెంపకం చేపడతామన్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను గుర్తించాలని ఇప్పటికే కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఏపీవో మణికుమారి, ఏపీఎం డీఆర్‌డీఏ దుర్గాప్రసాద్, వెలుగు, ఉపాధిహామీ సిబ్బంది, పాల్గొన్నారు.