
ఇద్దరు విద్యార్థినుల దత్తత
అరకులోయటౌన్: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులను కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పట్టాసి చలపతిరావు, వి.సునీత దత్తత తీసుకున్నారు. ఈ సందర్బంగా చలపతిరావు, వి.సునీత దంపతులు మాట్లాడుతూ కళాశాలకు చెందిన వనబసింగి పూజ బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతూ సికిల్‌సెల్ ఎనీమియాతో బాధపడుతుందని, కాలేజి ఫీజు కూడా చెల్లించలేని స్ధితిలో ఉందన్నారు. అదే విధంగా బికాం కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఫీజు జమచేయలేని పరిస్థితులో ఉన్న డుంబ్రిగుడ మండలం, సాగర పంచాయతీ బలియగుడ గ్రామానికి చెందిన పాంగి కవిత కూడా ఆ పరిస్థితిలో ఉంది. వారిని బంగారు కుటుంబంగా ప్రభుత్వం పీ–4 కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకున్నటుర్ట వారు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన రెండు కుటుంబాలను దత్తత తీసుకొని విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చిన ఇన్‌చార్జి ప్రిన్స్‌పాల్ దంపతులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పలువరు హర్షం వ్యక్తం చేశారు.