
నేటి నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
సింహాచలం: సింహగిరిపై మంగళవారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం రామాయణ నవరాత్ర పారాయణం, సాయంత్రం సింహవల్లీ తాయారు, చతుర్భుజ తాయారు, సువర్ణ అమ్మవార్లకు తిరువీధి నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఆలయంలో శ్రీరామాయణ నవరాత్ర పారాయణ పఠనం, అమ్మవార్లకు తిరువీధి ఉంటుందని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. ఈ నెల 27న సింహవల్లీ తాయారు సన్నిధిలో వీరలక్ష్మీ ఆరాధనం, 29న మూలానక్షత్రం పురస్కరించుకుని ఆయుధపూజ(మూల పూజలు) నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2న కొండదిగువ పూలతోటలో సాయంత్రం జమ్మివేట ఉత్సవం జరుగుతుందన్నారు. భక్తులంతా ఈ పూజల్లో పాల్గొని, తరించాల్సిందిగా కోరారు.
27న వీరలక్ష్మీ ఆరాధనం, 29న ఆయుధపూజ