
అంతర్జాతీయ ప్రమాణాలతో కాఫీ తోటల అభివృద్ధి
పాడేరు : జిల్లాలోని కాఫీ తోటలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లా మడికేరి పట్టణంలోని కుషాల్ నగర్‌లో టాటా కాఫీ ఎస్టేట్‌ను ఆదివారం పాడేరు కాఫీ బోర్డు అధికారులు, సభ్యులతో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లాలో కాఫీ తోటలకు పురుగు పట్టకుండా ఉండేందుకు నివారణ విధానం, మార్కెటింగ్, కాఫీ తోటల్లో క్యూరింగ్, ల్యాబ్, పల్పింగ్ యూనిట్లు తదితర అంశాలను పరిశీలించినట్టు ఆయన పేర్కొన్నారు. అక్కడి కాఫీ రైతుల అనుభవాలు తెలుసుకున్నారు. అంతర్జాతీయంగా అరకు కాఫీకు మంచి గుర్తింపు ఉందన్నారు. అనంతరం కూర్గ్ జిల్లా కలెక్టర్‌తో పలు అంశాలపై చర్చించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా కాఫీ సీనియర్ మేనేజర్లు వినయ్, అయ్యప్ప, కాఫీ బోర్డు డీడీ డాక్టర్ చంద్రశేఖర్, సీనియర్ లైజనింగ్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో కాఫీ తోటల అభివృద్ధి