
సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి
సింహాచలం: సింహగిరిపై ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఆలయ కల్యాణ మండపంలోని వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టంపజేశారు. విష్వక్సేనపూజ,పుణ్యాహవచనం, సంకల్పం, కంణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం కమనీయంగా నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం,శేషవస్త్రాలు అందజేశారు.
● శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సహస్రనామార్చన ఘనంగా జరిగింది. 1001 నామాలు పఠిస్తూ స్వామికి తులసితో అర్చన చేశారు.
● శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం గరుడసేవ వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణ మండపంలోని గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అధిష్టంపజేసి అష్టోత్తరంపూజ నిర్వహించారు. విశేషంగా హారతి అందజేశారు. భక్తులను గరుడవాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు.
అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు

సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి