ఇక ‘గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారంటీ’ | - | Sakshi
Sakshi News home page

ఇక ‘గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారంటీ’

Oct 5 2026 11:54 PM | Updated on Oct 5 2026 11:54 PM

● ఉపాధి జాబ్‌కార్డుల స్థానంలో జారీ ● ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ● 125 రోజుల పనిదినాల కల్పనే లక్ష్యం

కై లాస్‌నగర్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్‌కార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారంటీ కార్డులను జారీ చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని ఆసక్తి గల కూలీలు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే ఎంపీడీవోలు వాటిని పరిశీలించి జారీ చేస్తున్నారు. కాగా ఎల్‌నినో కారణంగా కూలీలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో 60 మంది పనిచేసేలా లక్ష్యాలను నిర్దేశించారు.

చట్టం మార్పు చేయడంతో..

దశాబ్దాలుగా సాగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా గ్రామీణ (వీబీ జీ రాంజీ) మిషన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై 1నుంచి రాష్ట్రంలో దీన్ని అమల్లోకి తెచ్చారు. ఉపాధి హామీలో కూలీలకు వంద రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉండగా నూతన మిషన్‌ కింద 125 రోజులు కల్పించాలని నిర్ణయించారు. ఇలా ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో కొత్త కార్యక్రమం ద్వారా గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారంటీ కార్డులను జారీ చేయాలని ఆదేశించారు. ఇది వరకు జాబ్‌కార్డులు లేని గ్రామీణ ప్రజలు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగే వరకు పాత కార్డులు చెల్లుబాటవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఏడాది తర్వాత కొత్తకార్డుల జారీ..

ఉపాధిహామీ పథకం కింద పనులకు హాజరయ్యే కూలీలకు ఇది వరకు రెగ్యులర్‌గా జాబ్‌కార్డులు జారీ చేసేవారు. అయితే ఈ పథకం కింద చేసిన పనిదినాల ఆధారంగా జాబ్‌కార్డు కలిగిన ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లుగా గతేడాది జనవరి 26న ప్రకటించింది. దీంతో జాబ్‌కార్డులకు అప్పట్లో డిమాండ్‌ ఏర్పడింది. గమనించిన రాష్ట్ర సర్కారు కొత్తకార్డుల జారీ నిలిపివేసింది. కొత్తగా పెళ్‌లైన యువత, అత్తారింటికి వచ్చిన మహిళలు కార్డులు లేకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లలేని పరిస్థితి. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కూలీల పనిపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏడాది తర్వాత కొత్తవి జారీ అవుతున్నాయి. కార్డులు పొందిన వారికి 125 రోజుల పనిదినాలు కల్పించనున్నారు. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.308 కూలి చెల్లించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి హామీ జాబ్‌కార్డు స్థానంలో కొత్తగా గ్రామీణ రోజ్‌గార్‌ గ్యారంటీ కార్డులను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఆసక్తి గల కూలీలు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలి. కార్డు కోసం పంచా యతీ కార్యదర్శికి కుటుంబ సభ్యులందరి ఆధార్‌, బ్యాంకు అకౌంట్‌ జిరాక్స్‌ జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. కార్యదర్శి వాటిని వి చారించి ఎంపీడీవోకు పంపిస్తారు. అక్కడ పరిశీలించి కొత్తవిజారీ చేస్తారు.

– రాంప్రసాద్‌, అదనపు డీఆర్డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement