‘రెడ్‌క్రాస్‌’ జిల్లా చైర్మన్‌గా క్రాంతికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

‘రెడ్‌క్రాస్‌’ జిల్లా చైర్మన్‌గా క్రాంతికుమార్‌

Oct 5 2026 11:54 PM | Updated on Oct 5 2026 11:54 PM

● వేకువజాము వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు

కై లాస్‌నగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌గా డాక్టర్‌ ఆడే క్రాంతికుమార్‌ ఎన్నికయ్యారు. 15 మంది కార్యనిర్వాహక కమిటీ ఎనినక కోసం ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించగా సోమవారం ఉదయం 6గంటల వరకు కొనసాగింది. 46మంది బరిలో ఉండడంతో ప్రక్రియలో ఆలస్యమైంది. మొత్తం 3,999 ఓట్లకు గాను 1,546 పోలయ్యాయి. తొలిసారిగా బరిలో నిలిచిన ప్రభు త్వ అధికారుల ప్యానెల్‌ ఈ ఫలితాల్లో సత్తా చాటింది. ఆ ప్యానెల్‌ తరఫున పోటీ చేసిన వారంతా విజయం సాధించారు. ఇందులో క్రాంతికుమార్‌ 1,064 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. రాథోడ్‌ జైసింగ్‌ 946, బండారి కృష్ణ 911 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఇది వరకు చైర్మన్లుగా పనిచేసి, తాజాగా బరిలో నిలిచిన వారు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. విజేతలను ప్రకటించిన అనంతరం కార్యనిర్వాహక కమిటీ సభ్యులను జిల్లా పరిశీలకులు, అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. చైర్మన్‌గా క్రాంతికుమార్‌, వైస్‌చైర్మన్‌గా ప్రభుత్వ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడిపల్లి మనోహర్‌, కోశాధికారిగా డీఎస్సీడీవో సునీతాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులుగా బండారి కృష్ణ, నెమ్మని రాజేశ్వర్‌రావు, జోనపల్లి సంజీవ్‌రావు, నాంపల్లి సౌందర్య, సామ రూపేశ్‌రెడ్డి, చింతకుంట వెంకటనారాయణ రాజు, సామ రమేశ్‌రెడ్డి, మాసం అనిల్‌, కుర్మే విశ్వనాథ్‌, పత్తివార్‌ గజానన్‌, కొరెడ్డి పార్థసారథి ఎన్నికయ్యారు. కాగా రిటైర్డ్‌ టీచర్‌ నెమ్మని రాజేశ్వర్‌రావు స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

అనూహ్యంగా చైర్మన్‌ ఎన్నిక ..

బరిలో నిలిచిన ప్రభుత్వ అధికారుల ప్యానెల్‌ తరఫున చైర్మన్‌గా మనోహర్‌, జైసింగ్‌ రాథోడ్‌, సునీతా కుమారీల్లో ఒకరిని ఎన్నుకుంటారానే ప్రచారం సా గింది. అయితే ఫలితాలు వెల్లడైన అనంతరం అనూ హ్య మార్పు చోటు చేసుకుంది. ఊహించని విధంగా ప్రైవేట్‌ వైద్యుడు క్రాంతికుమార్‌ పేరు తెరపైకి వచ్చింది. మెజార్టీ సభ్యులు ఆయనకు మద్దతు తెలి పారు. నూతన కార్యవర్గాన్ని అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఎన్నికల అధికారి బి.రవి పూలమాల, శాలు వాలతో సత్కరించి అభినందించారు. మేనేజింగ్‌ కమిటీ సభ్యులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌, జెడ్పీ సీఈవోను శాలువాతో ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement