ఎంఎస్పీకి దిగువ కు పత్తి ధర | - | Sakshi
Sakshi News home page

ఎంఎస్పీకి దిగువ కు పత్తి ధర

Oct 5 2026 11:54 PM | Updated on Oct 5 2026 11:54 PM

● కొనుగోళ్లు మొదలవకుండానే రైతుల గోస ● ఎల్‌నినో ప్రభావంతో తగ్గిన దిగుబడి

పది రోజుల క్రితం బహిరంగ మార్కెట్‌లో పత్తి క్వింటాలు ధర రూ.8,800–రూ.9వేలు పలికింది. బేల్‌, సీడ్‌ ధరలు పెరుగుతుండడంతో రేటు మరింత పైకి వెళ్తుందని రైతులు భా వించారు. అయితే సోమవారం ధర అమాంతంగా రూ.8,300 వరకు పడిపోయింది. ఇది ప్రభుత్వ మద్దతు ధర రూ.8,667 కంటే తక్కు వ. మార్కెట్‌లో ఇంకా కొనుగోళ్లు ప్రారంభం కాకముందే ఈ పరిస్థితి ఉండడం గమనార్హం.

ఈ రైతు పేరు బాగిడి కిష్టయ్య. తాంసి మండలం వడ్డాడి గ్రామం. 8 ఎకరాల్లో వర్షాధారంగా పత్తి సాగు చేశాడు. ఇటీవల మొదటి తీత పత్తి ఏరడం షురూ చేయగా.. నాలుగు ఎకరాల్లో ఇప్పటివరకు 4 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. సాధారణంగా పంటకు నీటి తడులు అందించి ఉంటే కనీసం 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదన్న ఆవేదన ఈ రైతులో కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేతికొస్తున్న పంట దిగుబడులు చూసి రైతులు హతాశులవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement