నార్నూర్: ప్రభుత్వ ఉపాధ్యాయులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఈ వో మాధవి అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని పలు పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. నార్నూర్ జెడ్పీ ఉన్నత, ఆదర్శ పాఠశాలల్లో రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేశారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అనంతరం గాదిగూడ మండలంలోని సాంగ్వి ఎంపీపీఎస్‌ను తనిఖీ చేసి విద్యార్థుల సంఖ్య, హాజరు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉ పాధ్యాయులు పనిచేయాలని అన్నారు. ఇంగ్లిష్ లె ర్నింగ్ ప్రోగ్రాంను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంఈవోలు మనోహర్, రమేశ్, సీఆర్పీలు గోవింద్, వినోద్, ప్రధానోపాధ్యాయులు అనిత, బాజీరావ్ తదితరులున్నారు.
జిల్లా వ్యాప్తంగా బార్లు బంద్
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారులకు కొత్తగా విధించిన అదనపు ప్రివిలేజ్ ట్యాక్స్ భారాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ బార్‌ల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ పాటించాయి. అసోసియేషన్ అధ్యక్షుడు రమాకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో యజమానులు బంద్ పాల్గొ ని హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాకు తరలి వెళ్లారు. కొత్త ప్రివిలేజ్ ఫీజు విధానంతో తీవ్ర ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.


