‘విద్యుత్‌’ ఆంక్షలు ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

‘విద్యుత్‌’ ఆంక్షలు ఎత్తివేయాలి

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

● మాజీ మంత్రి జోగు రామన్న

● మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యుత్‌ అధికారులపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఎత్తివేసి రైతులకు 12గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్‌ చేశారు. అఖిల రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సీఐటీ యూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడారు. గత బీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాత్రం తగ్గడం సిగ్గుచేటని విమర్శించా రు. విద్యుత్‌ వినియోగంపై ప్రభుత్వం అధికారుల పై ఆంక్షలు విధిస్తూ ఒత్తిడి పెంచుతోందని ఆరోపించారు. రైతులకు 12 గంటల నిరంతర కరెంటు అందిస్తే పంటలను సమృద్ధిగా పండించే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల వాతావరణ ప్ర భావంతో బేల, జైనథ్‌, ఆదిలాబాద్‌రూరల్‌ ప్రాంతాల్లో పంట లు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్ర సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ఆదిలాబాద్‌ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం నాయకులు బండి ద త్తాత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు సహాసినిరెడ్డి, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్ర న్న, దర్శనాల మల్లేశ్‌, గంగాధర్‌, కొండ రమేష్‌, లక్ష్మణ్‌, తిరుపతి, చందాల రాజన్న, మెట్టు ప్రహ్లాద్‌, కొముర రాజు, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement