ముగిసిన పోలీస్‌ వార్షిక క్రీడలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన పోలీస్‌ వార్షిక క్రీడలు

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

● ఓవరాల్‌ చాంపియన్‌గా క్యూఆర్టీ వారియర్స్‌ ● విజేతలకు బహుమతులు అందజేసిన ఎస్పీ

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన పోలీస్‌ వార్షిక గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌–2026 ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. స్పోర్ట్స్‌ మీట్‌లో క్యూఆర్టీ వారియర్స్‌ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. విజేతలకు ఎస్పీ ట్రోఫీలు, మెడల్స్‌, మెమెంటోలు అందజేశారు. అథ్లెటిక్స్‌ వ్యక్తిగత విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పురుష, మహిళా కానిస్టేబుళ్లకు పతకాలు, బహుమతులు అందించారు. ఫైనల్‌ మ్యాచ్‌ పోటీలను ఆసక్తిగా తిలకించారు. రెండు బృందాలుగా జిల్లా అధికారులు విడిపోయి టగ్‌ ఆఫ్‌ వార్‌లో తలపడ్డారు. ఫైనల్‌లో విక్టర్స్‌ బృందం విజయం సాధించింది. ఓవరాల్‌ చాంపియన్‌ క్యూఆర్టి వారియర్స్‌ కై వసం చేసుకుంది. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులకు మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలో క్రీడా స్ఫూర్తిని కల్పించేందుకు స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించినట్లు తెలిపారు. కబడ్డీ, వాలీబాల్‌, టగఫ్‌ వార్‌, క్రికెట్‌, బాస్కెట్‌ బాల్‌, షటిల్‌ బాట్మింటన్‌, షాట్పుట్‌, జావిలిన్‌ త్రో, డిస్క్‌త్రో, లాంగ్లింప్‌, రన్నింగ్‌ 100 మీటర్స్‌, 200 మీటర్స్‌, 400 మీటర్స్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్యారం, చెస్‌, టెన్నికోట్‌, రిలే తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోలీస్‌ అధికారుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన మ్యూజికల్‌ చైర్‌, లెమన్‌ స్పూన్‌ ఆటలు అలరించాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మౌనిక, ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్‌, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement