పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

ఈనెల రెండో వారంలో షురూ

రైతులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

మార్కెట్‌ యార్డును పరిశీలించిన కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌టౌన్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈనెల రెండో వారంలో ఆదిలా బాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ ని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్ల తేదీని త్వరలో ఖరారు చేసి రైతులకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివా రం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూషతో కలిసి మార్కెట్‌ యార్డును సందర్శించారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, తూకం యంత్రాలు, మరుగుదొడ్లు, ప్రహరీ తదితర ప్రాంతాలను పరిశీలించారు. కొ నుగోళ్ల సమయంలో రైతులకు అవసరమైన మౌలిక వసతులు, ట్రాఫిక్‌ నియంత్రణ, తూకం తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ ఏడాది ఏఈవోల వద్ద కూడా తేమనిర్ధారణ యంత్రాలను అందుబాటు లో ఉంచామని కలెక్టర్‌ తెలిపారు. రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకురావడానికి ముందే తేమ శా తంపై సందేహాలను సమీప ఏఈవోల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహోర్‌ ప్రాంతాల రైతుల కోసం ప్ర త్యేకంగా జిన్నింగ్‌ మిల్లులను ఏర్పాటు చేస్తున్నామని, కేటాయించిన మిల్లుల నిల్వ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే పత్తిని తీసుకురావాలని కోరారు. రోడ్డు పనులు కొనసాగుతున్నందున రైతులు, వాహనదారులు రాంపూర్‌ రోడ్డు మీదుగా మా ర్కెట్‌ యార్డుకు రావాలని సూచించారు. మార్కెట్‌లో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. పత్తి కొనుగోళ్లను పారదర్శకంగా, రైతులకు అనుకూలంగా నిర్వహించేందుకు అధి కారులు, మార్కెట్‌ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాట్లాడుతూ రైతులకు సమాచారం, సహాయం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌, డిజిట ల్‌ డిస్‌ప్లే ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది తూకం తదితర అంశాల్లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీ సుకుంటున్నామని అన్నారు. వారి వెంట మార్కె ట్‌ డీఎంవో గజానంద్‌, సెలెక్షన్‌ గ్రేడ్‌ విఠల్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ సభ్యులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement