ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో లోహిత్ సాయి, అనుదీప్ రాజ్ ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 11న గచ్చిబౌలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. లోహిత్ సాయి ఫ్రీస్టైల్ 50, 100, 200 మీటర్లతోపాటు 200 మీటర్ల ఐఎం విభాగాల్లో అర్హత సాధించాడు. అనుదీప్ రాజ్ బ్రెస్ట్‌స్ట్రోక్ 50 మీటర్లను 35.50 సెకన్లు, 100 మీటర్లను 1:22.51 నిమిషాలు, 200 మీటర్లను 3:03.67 నిమిషాల్లో పూర్తి చేసి అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులను స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, కోచ్ వంశీ ఆదివారం అభినందించారు.


