నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ ప్రభుత్వంలో విలీనం విషయంలో రేవంత్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నా రు. ఈనెల 9న జరగనున్న ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బలపరుస్తున్న అశ్వత్థామ రెడ్డి నాయకత్వాన్ని గెలిపిద్దామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులు, ప్రభుత్వం మద్దతుగా ఉన్న యూనియన్‌ను గెలిపించుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయి విలీనం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ సెక్రెటరీ కొంతం గణేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


