లక్ష్మణచాంద: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్ 17 జోనల్ స్థాయి బాలికల క్రికెట్ సెలక్షన్స్ ఆదివారం నిర్మల్‌రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలోని లక్కీ క్రికెట్ అకాడమీలో జరిగాయి. ఈ సెలక్షన్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల్ జిల్లాల నుంచి బాలికలు తరలివచ్చారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సెలక్షన్ కమిటీలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్, మాజీ డీవైఎస్‌వో శ్రీనివాస్, ఆదిలాబాద్ మాజీ ఎస్జీఎఫ్ సెక్రటరీ కాంతారావు, పీడీ దేవేందర్, లక్కీ క్రికెట్ అకాడమీ కోచ్ సుదర్శన్, పీడీలు పాల్గొన్నారు.


