ఆటో, బస్సు ఢీ.. ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఆటో, బస్సు ఢీ.. ఒకరికి గాయాలు

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

భైంసాటౌన్‌: పట్టణంలోని బాసర రోడ్‌లో సేవాలాల్‌ చౌక్‌ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓవైసీనగర్‌కు చెందిన అబ్దుల్‌ సోహెల్‌ స్థానిక రిలయన్స్‌ పెట్రోల్‌ పంపులో డీజిల్‌ పోయించుకుని పట్టణం వైపు వెళ్తున్న క్రమంలో మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో ముందు భాగం దెబ్బతినగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో ఏరియాస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement