మామడ: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నేరాల నియంత్రణలో ని రంతర సిబ్బంది గస్తీ ఎంతో కీలకమని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖ్‌దేవ్ బోబాడే అన్నారు. ఆదివారం వన్యప్రాణి వా రోత్సవాల సందర్భంగా మామడ అటవీ క్షేత్ర పరిధిలో ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించా రు. అటవీ ప్రాంతంలో పర్యటించి వృక్షజా లం, వన్యప్రాణుల ఆనవాళ్లు, పాదముద్రలు పరిశీలించా రు. అటవీ సిబ్బంది కాలినడకన తిరిగి జీవవైవిద్యం పరిరక్షించేందుకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్ ఆర్‌ఓలు శ్రీనివాస్‌రావు, రామకృష్ణ, రమేశ్ రాథోడ్, సిబ్బంది పాల్గొన్నారు.


