దిగుమతిపై 16 నుంచి 11 శాతానికి తగ్గింపు విదేశీ ముడి పామాయిల్ వచ్చే అవకాశం గెలల ధరలపై ప్రభావం అన్నదాతల్లో ఆందోళన
ఆయిల్‌పామ్‌పై
బోథ్: దేశీయంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక రైతులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశాల నుంచి వచ్చే ముడి పామాయిల్ దిగుమతులపై సుంకాలు 16 నుంచి 11 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 5 శాతం సుంకాల కోత నిర్ణయం అమల్లోకి రావడంతో క్షేత్రస్థాయిలో తోటలు సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో 3,402 ఎకరాల్లో 1,114 మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు.
పడిపోనున్న గెలల ధరలు..
విదేశాల నుంచి పామాయిల్ ముడి చమురు తక్కు వ సుంకంతో దేశంలోకి ప్రవేశిస్తే, స్థానిక మార్కెట్ల లో తాజా ఆయిల్‌పామ్ గెలలకు డిమాండ్ పడిపోనుంది. అయితే ప్రస్తుతం ధర మాత్రం ఆల్‌టైం రి కార్డుగా ఉంది. గెల టన్నుకు రూ.24,025 ధర పలు కుతోంది. అయితే గత నెల 24 నుంచి సుంకాలు త గ్గించడంతో ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం గెలలను రైతుల వద్ద నుంచి తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దిగుమతి సుంకం తగ్గడంతో ప్రాసెసింగ్ కంపెనీలు దేశీయ రైతుల వద్ద కొనుగోలు చే సే గెలల ధరలను గణనీయంగా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రతికూల ప్రభావం ఈ నెలలో గెలల కొనుగోలు ధరలపై తీవ్రంగా పడనుంది.
పెరుగుతున్న సాగు..
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అధికారులు సైతం గ్రామాల్లోని రైతులకు ఆయిల్‌పామ్ వైపు మళ్లాలని సూచిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 1,114 మంది రైతులు 3,402 ఎకరాల్లో ఆయిల్‌పా మ్ తోటలు సాగు చేశారు. ప్రస్తుతం కొంతమంది రైతులు ఇటీవలే గెలలను మద్దతు ధరకు విక్రయించారు. లాభాలు కనిపించడంతో మరింత మంది రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం సుంకాలు తగ్గించడంతో గెలల ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో గెలల ధరలు మరింత తగ్గితే తీవ్రంగా నష్టపోతామ ని వాపోతున్నారు. ఈ సుంకాల తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని, పాత సుంకాలను పునరుద్ధరించి గెలలకు గ్యారెంటీ మద్దతు ధర కల్పించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది.
ఉమ్మడి జిల్లా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం(ఎకరాల్లో )..


