దైవదర్శనానికి వచ్చి తిరిగిరాని లోకాలకు | - | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వచ్చి తిరిగిరాని లోకాలకు

Oct 5 2026 4:02 AM | Updated on Oct 5 2026 4:02 AM

● రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సారంగపూర్‌: నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు పిట్ల గణేశ్‌(32) ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్‌ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన మృతుడు పిట్ల గణేశ్‌ తన బంధువులు, స్నేహితులతో కలిసి అడెల్లి మహాపోచమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం వచ్చాడు. దర్శనం చేసుకుని భోజనం చేసిన తర్వాత గణేశ్‌ బహూర్భుమికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే గణేశ్‌ మృతి చెందాడు. ఆస్పత్రికి వెళ్లాక వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. గణేశ్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement